AP SSC Results 2022 Manabadi:ఏపీ 10వ తరగతి ఫలితాలు రేపు (జూన్‌ 4) విడుదల కానున్నాయి.

ఈ నెల 4న ఏపీ టెన్త్‌ ఫలితాలను విడుదల కానున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

జూన్‌ 4న ఉదయం 11 గంటలకి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి విజయవాడలో ఫలితాలు ప్రకటించనున్నారు.

ఈ ఏడాది గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో AP SSC Results 2022 ను ప్రకటించనుంది.

ఈసారి రికార్డు స్థాయిలో 25 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుండటం విశేషం.

ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 6,21,799 మంది హాజరయ్యారు.