రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ డబ్బులు వచ్చేది అప్పుడే..!

PM Kisan 12th Installment: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది.

రైతులకు ఆర్థికంగా ఆసరా ఉండేందుకు కేంద్ర సర్కార్‌ ప్రధాన్‌ మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజనం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్‌ డబ్బులు త్వరలో అకౌంట్లో జమ కానున్నాయి.

ప్రతి ఏడాది కేంద్రం దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6,000లను అందిస్తోంది.

మూడు వితల్లో ఈ డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 11వ విడత రూ.2వేలను అకౌంట్లో జమ చేయగా, ఇప్పుడు 12వ విడత డబ్బులు రానున్నాయి. 

ఈ పథకంలో డబ్బులు పొందాలంటే రైతులు కేవైసీ చేసి ఉండటం తప్పనిసరి.

 ఈ కేవైసీని పూర్తి చేసుకునేందుకు జూలై 31తో ముగిసింది. ఆలోపే కేవైసీ చేసుకున్న రైతులకు ఈ 12వ విడత డబ్బులు అకౌంట్లు జమ కానున్నాయి.

కేవైసీ చేయని రైతులకు డబ్బులు అందవని గుర్తించుకోవాలి.

इसी प्रकार से पीएम किसान योजना की लेटेस्ट खबर प्राप्त करने के लिए निचे दी गयी लिंक पर क्लिक करें.