కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో పీఎం కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అర్హత కలిగిన రైతు కుటుంబాలకు రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు.
ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. ఇప్పటివరకు 11 విడతలుగా నగదు జమ అయ్యింది. ఇప్పుడు 12వ విడత నగదు రావాల్సి ఉంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరంలో మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండవ విడతను ఆగస్టు 1 నుంచి 30 నవంబర్ మధ్య, మూడవ విడత మెుత్తాన్ని డిసెంబర్ 1 నుంచి 31 మార్చి లోపు అందించింది.
కుడి వైపున New Former Registration కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి. తరువాత, ఆధార్ సంఖ్య, మొబైల్ నంబర్, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. దీనితో పాటు, క్యాప్చా కోడ్ని నమోదు చేసి.. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.